ఢిల్లీ:అల్లర్ల నేపథ్యంలో మోదీ ట్వీట్
- February 26, 2020
ఢిల్లీ:ఈశాన్య ఢిల్లీలో అల్లర్లపై నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.. అందులో 'శాంతి మరియు సామరస్యం మనకు ప్రధానమైనవి అన్ని సమయాల్లో శాంతి మరియు సోదరత్వాన్ని కాపాడుకోవాలని నా సోదరీమణులు మరియు ఢిల్లీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశాంతతో ఉండటం చాలా ముఖ్యం.. సాధారణ స్థితి త్వరగా పున రుద్ధరించబడుతుంది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై విస్తృతమైన సమీక్ష జరిగింది. పోలీసులు మరియు ఇతర ఏజెన్సీలు శాంతి మరియు సాధారణ స్థితి కోసం కృషి చేస్తున్నారు' అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లకు 20 మందికి పైగా మృతి చెందారు. అల్లర్లకు ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి మరవకముందే.. తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న అంకిత్ శర్మ(26) అనే పోలీస్ అధికారి అల్లర్లకు తీవ్రంగా గాయపడి మృతిచెందారు.
ఈశాన్య ఢిల్లీలోని చాంద్ బాగ్‌లో బుధవారం ఉదయం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అంకిత్ శర్మపై దాడి చేసి.. ఆయనను హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఆయన మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..