షార్జా: అల్ మజాజ్ లో స్మార్ట్ పార్కింగ్ ఓపెన్..గంటకు Dh5 ఛార్జ్
- February 27, 2020
షార్జా మున్సిపాలిటీ పరిధిలో ఫస్ట్ స్మార్ట్ పే అండ్ పార్క్ ఈ రోజు ప్రారంభమైంది. అల్ మజాజ్ 3లో ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ పార్కింగ్ ప్లేస్ మున్సిపాలిటి పరిధిలోనే మొదటిది కావటం విశేషం. వెహికిల్స్ పార్కింగ్ జోన్ లోకి రాగానే అక్కడ అమర్చిన సెన్సార్స్ నెంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత వెహికిల్స్ రిటర్న్ అయినప్పుడు మరోసారి స్కాన్ చేసి ఎన్ని గంటలు పార్క్ చేశారో లెక్కగట్టి ఆటోమెటిక్ గా బిల్లింగ్ జనరేట్ అవుతుంది. సభ్యత్వం ఉన్నవారి అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అవుతాయి. సభ్యత్వం లేకుండా అక్కడే మాన్యువల్ పే చేయవచ్చు. బిల్ ఆపరేటర్ డివైజ్ దగ్గర డబ్బులు ఇవ్వొచ్చు. లేదంటే స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ ఉంది. స్మార్ట్ పే అండ్ పార్క్ లో పార్కింగ్ ఫీజు గంటకు Dh5, ఒక రోజుకు Dh40, వారానికి Dh100, నెలకు Dh350, ఏడాదికి Dh3,500గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







