గల్ఫ్ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ... చమురురంగానికి ఎదురు దెబ్బ..
- March 01, 2020
కరోనా ఈపేరు వింటే ప్రపంచం వణికిపోతున్నది. ఏ దేశంలోకి ఎలా ప్రవేశిస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ వలన ప్రపంచంలో దాదాపుగా 60కి పైగా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. మొన్నటి వరకు చైనా వరకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు చైనా నుంచి కొరియా తో పాటు గల్ఫ్ దేశాలలో విస్తరించింది.
గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఇరాన్, కువైట్, లెబనాన్ దేశాలను ఈ వైరస్ ఇబ్బందులు పెడుతున్నది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద 3000 మందికి పైగా మరణించారు. 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గల్ఫ్ దేశాల్లో రోజు రోజుకు ఈ వైరస్ ఎఫెక్ట్ పెరిగిపోతున్నది. దీంతో ప్రపంచదేశాలు అయోమయంలో పడిపోయాయి. గల్ఫ్ లో వైరస్ దెబ్బకు చమురు రంగం కుదేలైంది. ముడి చమురు ధరలు పడిపోతున్నాయి. చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాన్, కువైట్ దేశాలలో కరోనా కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడం మొదలుపెట్టింది. పైగా ప్రజా రవాణను నిలిపివేస్తుండటంతో చమురు ధరలు తగ్గిపోతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు