రమదాన్ వరకూ కరోనా కల్లోలం?
- March 02, 2020
కువైట్: కువైట్‌లో కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 46కి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిలో కొత్తగా కరోనా వైరస్‌ని కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైరస్ తొలిసారిగా దేశంలో కనుగొనబడినప్పటినుంచీ అత్యంత పకడ్బందీగా ఈ వైరస్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరిస్థితి కొంత అదుపులోనే వున్నట్లు కన్పిస్తోంది. పూర్తిగా కరోనా కేసులు జీరో అయ్యేదాకా కరోనాపై పోరాటం ఆగబోదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, త్వరలో రమదాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఐసోలేషన్ పద్ధతిలోనే వేడుకలు జరుగుతాయా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కువగా జనం గుమి కూడే అవకాశం వుంటుంది కాబట్టి, ఈలోగా కరోనా పూర్తిగా అంతమైతే తప్ప.. రమదాన్ వేడుకల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు వుండొచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు