దుబాయ్ లో 'ధూమ్ ధాం'

- March 03, 2020 , by Maagulf
దుబాయ్ లో 'ధూమ్ ధాం'

దుబాయ్:నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి వేలకువేలు వాళ్ళకి సమర్పించి తీరా గల్ఫ్ దేశాలకు వచ్చాక మోసపోయామని తెలిసి ఏమి చేయాలో పాలుపోని ఎందరో అమాయక కార్మికుల బాధలు నేడు తెలుగు రాష్ట్రాలకు పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా వలస కార్మికులు తమకు న్యాయం చేయాలనీ, కస్టాలు తీరే దిశగా NRI పాలసీ ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

దుబాయ్ లో నివసిస్తున్న వలస కార్మికులు తెలంగాణ ప్రభుత్వం తమకు NRI పాలసీ ప్రకటించాలని కోరుతూ 'ధూమ్ ధాం' అని పేరుతో కార్యక్రమం నిర్వహించటం జరిగింది.గత శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం 'అల్ కూజ్' లోని Dulsco Arena  లో కార్మికులు నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ప్రముఖ జానపద గాయకులు జంగిరెడ్డి మరియు రేలారే రేలా గంగ ముఖ్య అతిధులుగా విచ్చేసారు.కార్మికులు పాలసీ ని కోరుతూ తమదైన శైలిలో పాటలు పాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృష్ణ దొనికేని మాట్లాడుతూ "ఒక వేదికపై ప్రతి సోదరుడు NRI పాలసీ కోసం గళం విప్పి కేసీఆర్ ను కోరుతున్నారని, ఈ పాలసీ ప్రకటించటం పలు కారణాల మూలంగా ఇప్పటికే ఆలస్యం అయింది కావున ఎంత త్వరగా ప్రకటిస్తే అంత ఆనందదాయకం" అని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లేష్ కోరేపు రికార్డు చేసిన NRI పాలసీ పాటను విడుదల చేసారు.ఈ కార్యక్రమానికి దుబాయ్ లోని పలు సంఘసేవకులు,తెలుగు అసోసియేషన్ ప్రముఖులు,4000 వేలకు పైగా కార్మికులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వంశి గౌడ్ (GWAC-ఉపాధ్యక్షులు) ధన్యవాదాలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com