జెడ్డా:సౌదీ అరేబియా డేంజర్ బెల్స్..కింగ్ డమ్ కరోనా వైరస్ ఫస్ట్ కేస్

- March 03, 2020 , by Maagulf
జెడ్డా:సౌదీ అరేబియా డేంజర్ బెల్స్..కింగ్ డమ్ కరోనా వైరస్ ఫస్ట్ కేస్

జెడ్డా:ప్రాణంతక కరోనా వైరస్ సౌదీ అరేబియాలోకి కూడా ఎంటర్ అయ్యింది. సోమవారం తొలి కోవిడ్-19 కేసు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. చైనాలో వైరస్ ను గుర్తించిన తర్వాత ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోయాయి. దాదాపు 66 దేశాలకు విస్తరించింది. ఇంతటీ క్రిటికల్ కండీషన్స్ లో కూడా కింగ్ డమ్ లోకి వైరస్ ఎంటర్ కాకుండా సౌదీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా కరోనాపై పోరులో వెనుకబడిపోయింది. చివరికి ఆ మహమ్మారి దేశంలోకి ఎంటరైంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొన్నాళ్లుగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఇరాన్ లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చైనా తర్వాత ఇరాన్ లోనే కోవిడ్-19 మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సౌదీలో నమోదైన కరోనా బాధితుడు కూడా బహ్రెయిన్ మీదుగా ఇరాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్ లో కరోనా రోగుల సంఖ్య 523 నుంచి 1,501 కి పెరిగింది. మృతుల సంఖ్య 54 నుంచి 66కి పెరిగింది. ఇరాన్ లో రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు ఆందోళనకరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com