తెలంగాణలో 'కరోనా' వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రుల కీలక నిర్ణయాలు
- March 03, 2020
తెలంగాణ:కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రులు హెచ్చరించారు. ఈ రోజు కరోనాపై హైదరాబాద్‌లో మంత్రులు జరిపిన భేటీ ముగిసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా వస్తే తప్పక చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కోవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనాను అరికట్టేందుకు గాంధీ ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వైరస్‌పై పత్రికలు, టీవీలు ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనాకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల చెప్పారు. అన్ని శాఖల పరంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు