మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కరోనా కల్లోలం..ఖతార్ లో 8కి చేరిన పాజిటీవ్ కేసులు
- March 03, 2020
దోహా:చైనాలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ అవుతోందని అనుకునే లోపే కరోనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పడగ విప్పింది. చైనా వెలుపల వైరస్ ధాటికి అల్లాడిపోతున్న దేశాలు మిడిల్ ఈస్ట్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ లో పరిస్థితి అదుపు తప్పుతోంది. అక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్ కు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన కలిగించే అంశం. ఇరాన్ లో కరోనా మృతుల సంఖ్య 66కి పెరిగింది. కరోనా రోగుల సంఖ్య 1,501 కి పెరిగింది. చైనా తర్వాత కరోనా విరుచుకుపడ్డ దేశం ఇరాన్ మాత్రమే. ఇక గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పటికే కువైట్‌లో 56, బహ్రెయిన్‌లో 49, యూఏఈలో 21, ఒమన్‌లో 6, ఖతార్‌లో 7 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్ గా ఖతార్ మరో పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్ల లిస్ట్ ఎనిమిదికి పెరిగింది. ఈ కొత్త బాధితుడు కూడా ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తే. ఇరాన్ నుంచి తమ పౌరులను తీసుకొచ్చిన ఖతార్ అతన్ని ఇప్పటివరకు ఇతరులతో కాంటాక్ట్ కాకుండా జాగ్రత్త పడటం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 27న అతన్ని ఖతార్ కు తీసుకురాగా..ఐదు రోజుల తర్వాత వైరస్ పాజిటీవ్ గా తేలింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..