ఇన్‌బౌండ్ ట్రావెలర్స్‌పై ఒమన్ ఆంక్షలు
- March 03, 2020
మస్కట్:కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ (ఎంఓఎఫ్‌ఎ), ఇన్‌బౌండ్ ట్రావెలర్స్‌కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్‌ని జారీ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మినిస్ట్రీ, కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఒమన్‌లోకి ప్రవేశం ఇవ్వకూడదన్నది ఆ నిర్ణయాల్లో ఒకటి. వాయు మార్గంలోగానీ, జల మార్గంలోగానీ, రోడ్డు మార్గంలోగానీ వచ్చేవారిని ఒమన్‌లోకి అనుమతించరు. కాగా, జపాన్ మరియు సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణీకులకు మినహాయింపునిచ్చారు. చైనా, ఇరాన్, సౌత్ కొరియా మరియు ఇటలీ నుంచి వచ్చేవారిపై నిషేధం కొనసాగిస్తున్నారు. చైనాకి డైరెక్ట్ విమానాల్ని అలాగే ఇరాన్‌కి డైరెక్ట్ విమానాల్ని రద్దు చేశారు. ఇటలీ నుంచి చార్టర్డ్ టూరిజం విమానాలకీ అనుమతులు రద్దు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..