రియాద్:సౌదీలోకి ఎంట్రీ అంత ఈజీ కాదు..బోర్డర్స్ దగ్గర స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్

- March 04, 2020 , by Maagulf
రియాద్:సౌదీలోకి ఎంట్రీ అంత ఈజీ కాదు..బోర్డర్స్ దగ్గర స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్

రియాద్:ఇక నుంచి సౌదీ అరేబియాలోకి ఎంట్రీ అవటం అంత ఈజీ కాదు. చివరికి జీసీసీ దేశాల నుంచి వచ్చే వారికి సౌతం సౌదీ విధించిన కండీషన్స్ సాటిస్ ఫై అయితేనే దేశంలోకి ఎంట్రీ దక్కుతుంది. లేదంటే బోర్డర్ దగ్గర్నుంచే రిటర్న్ కావాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సౌదీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ కంట్రీస్ నుంచి గల్ఫ్ కంట్రీస్ కు తిరగొచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా తమ వివరాలను ఆయా గవర్నరేట్ లో తెలియజేయాల్సి ఉంటుంది. అక్కడ 14 రోజుల పాటు స్టే చేసిన తర్వాత వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ తో వస్తేనే సౌదీలోకి ఎంట్రీకి అనుమతిస్తారు. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, కువైట్ నుంచి సౌదీకి వెళ్లవారు తప్పనిసరిగా తమ సొంత దేశంలో వరుసగా రెండు వారాలు గడపాల్సిందే. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కోవిడ్-19 మనిషి శరీరంలోకి ఎంటరైనా తొలి 14 రోజులు అంతగా ప్రభావం చూపదు. రెండు వారాల తర్వాతే బ్లడ్ షాంపుల్స్ లో ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. దీంతో కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు తమ తమ దేశంలో 14 రోజులు ఉన్నట్లు అధికారిక అధారాలు చూపిస్తేనే బోర్డర్స్ దాటనిచ్చేలా నిబంధనలు విధించారు. ఈ మేరకు గల్ఫ్ దేశాల నుంచి సౌదీలోకి ఎంటరయ్యే సరిహద్దు రహదారుల్లో తనఖీలను ముమ్మరం చేశారు. ఏ మాత్రం సందేహం ఉన్నా..వాళ్లను తిప్పి పంపించేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com