అబుధాబి:బిగ్ టికెట్ లో Dh10 మిలియన్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న ఇండియన్
- March 04, 2020
అబుధాబి:ఇండియాకు చెందిన మోహన్ చంద్రదాస్ జాక్ పాట్ కొట్టేశాడు. సౌదీ అరేబియాలో ఉంటున్న అతనికి 10 మిలియన్ల దిర్హామ్స్ ల లాటరీ తగిలింది. మార్చి 3న జరిగిన బిగ్ టికెట్ అబుధాబి డ్రాలో అతను ప్రైజ్ మనీ విన్నర్ గా నిలిచాడు. అయితే..డ్రా తీసే సమయంలో అతను షాపింగ్ చేస్తుండటం వల్ల ఫేస్ బుక్ లైవ్ ఫాలో కాలేకపోయాడు. సో అతనికి ఈ లక్కీ న్యూస్ తెలిసేందుకు కొంత సమయం పట్టింది. బిగ్ టికెట్ ప్రతినిధి రిచర్డ్...మోహన్ చంద్రదాస్ కు కాల్ చేసి లాటరీలో Dh10 మిలియన్ల ప్రైజ్ మనీ గెల్చుకున్నట్లు చెప్పటంతో అతను నమ్మలేకపోయాడు. ఫిబ్రవరి 27న అతను లాటరీ టికెట్ కొన్న చంద్రదాస్ కు వారం తిరక్కముందే లక్ వెతుక్కుంటూ వచ్చింది. అయితే..కరోనా వైరస్ కారణంగా డ్రా ఈవెంట్ ను పబ్లిక్ లో తీయలేదు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..