1.95 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ దొంగతనం కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్‌

- March 04, 2020 , by Maagulf
1.95 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ దొంగతనం కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్‌

రియాద్‌:సౌదీ పోలీసులు, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. రియాద్‌లోని ఓ బ్యాంకు నుంచి డబ్బుని తరలిస్తున్న వాహనంపై దాడి చేసి 1.95 మిలియన్‌సౌదీ రియాల్స్‌ని దొంగతనం చేసిన కేసులో వీరిని నిందితులుగా భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 13న ఈ ఘటన జరిగిందని రియాద్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్‌ కల్నల్‌ షకీర్‌ అల్‌ తువైజిరి చెప్పారు. డబ్బు తరలిస్తున్న బ్యాంకు వాహనంపై ఆయుధాలతో దాడి చేసి, డబ్బుని దొంగిలించి ఫేక్‌ నెంబర్‌ ప్లేట్‌తో కూడిన కారులో నిందితులు పారిపోయారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com