‘కువైట్ వెళ్లాలంటే PCR మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి’
- March 04, 2020
ఏ.పి:ప్రస్తుతం ఎక్కడ విన్నా, చూసిన కరోనా వైరస్ గురించే అవగాహన కార్యక్రమాలు, సోషల్ మీడియాలో పోస్టులు, చర్చలు. అంతగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఈ వైరస్. తాజాగా కువైట్ ప్రభుత్వం ఈ నెల 8 వ తేదీనుండి కువైట్ వెళ్ళే ప్రతి వ్యక్తి తనకు కరోనా వైరస్ లేదని పిసిఆర్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని ఆదేశాలను జారిచేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటి (ఏపిఎన్ఆర్టిఎస్) ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఈ పిసిఆర్ మెడికల్ సర్టిఫికెట్ లేని వారిని కువైట్ విమానాశ్రయం నుండే వెనక్కు పంపనున్నట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించిందని, విమాన ఛార్జీలు సదరు వ్యక్తులే భరించాల్సి ఉంటుందని కువైట్ వైసీపీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మరియు సభ్యులు సమాచారం అందించారు.
మన రాష్ట్రం నుండి కొత్త వీసాలపై కువైట్ వెళ్లాలనుకునేవారు, అక్కడ పనిచేస్తూ సెలవుల నిమిత్తం స్వస్థలాలకు వచ్చి తిరిగి వెళ్తున్నవారు ఎవరైనా కూడా అక్కడకు వెళ్లి ఇబ్బందులు పడకుండా తప్పనిసరిగా మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలని ఏపిఎన్ఆర్టిఎస్ డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్. సూచించారు.
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో కరోనా వైరస్ నిర్దారించే కొన్ని ఆసుపత్రుల పేర్లు, వివరాలను కువైట్ ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం సూచించిన ఈ ఆసుపత్రుల నుండి పిసిఆర్ మెడికల్ సర్టిఫికెట్ పొందగలరని వెంకట్ తెలిపారు. ఆసుపత్రుల వివరాలు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కొరకు 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్స్ యాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించగలరు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు