స్కూళ్ళలో మాస్క్‌లు అవసరం లేదు

- March 05, 2020 , by Maagulf
స్కూళ్ళలో మాస్క్‌లు అవసరం లేదు

మస్కట్‌: ఒమన్‌లో కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) కేసుల సంఖ్య 15కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ పట్ల భయాందోళనలు పెరుగుతున్నాయి. మరోపక్క, స్కూళ్ళలో విద్యార్థులకు మాస్కులు అవసరం లేదని ఎక్స్‌పర్ట్‌ ఒకరు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ - ఇన్‌ఫెక్షియస్‌ డిసీజస్‌ ఎక్స్‌పర్ట్‌ మరియు కన్సల్టెంట్‌ అయిన ప్రొఫెసర్‌ ఎస్‌క్లిడ్‌ పీటర్సన్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు తమ డెస్క్‌లను క్లీన్‌గా వుంచుకోవడం అలాగే, ఏదన్నా వస్తువుని తాకిన తర్వాత మళ్ళీ ఆ చేతిని కంటికి లేదా ముక్కుకి తగిలించుకోకుండా వుండడంపై అవగాహన కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్క్‌ల కేంటే పరిశుభ్రతమ చాలా ముఖ్యమని చెప్పారాయన. కేవలం కరోనా వైరస్‌ బాధితులు మాస్క్‌లు పెట్టుకుంటే సరిపోతుందనీ, జలుబు సహా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి మాస్క్‌లు అవసరమౌతాయని ఆయన వివరించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాల పట్ల అవగాహన కలిగ ఇవుండాలని పీటర్‌సన్‌ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com