కరోనా కారణంగా 13వ తేదీకి వాయిదాపడిన 'అర్జున' విడుదల
- March 06, 2020
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ట్రైలర్స్ ఇటీవల విడుదలై...ట్రెండింగ్ లో ఉన్నాయని వారు చెప్పారు. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయకుమార్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: కన్మణి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!