దోహా:ఖతార్ గ్రాండ్ ప్రీ సర్క్యూట్ కు ఫ్రీ షటిల్ బస్సులు
- March 06, 2020
దోహా:ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు జరగుతున్న ఖతార్ గ్రాండ్ ప్రీ చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. లుసైల్ మెట్రో స్టేషన్ నుంచి లోసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వరకు దోహా మెట్రో ఫ్రీ షటిల్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. ప్రతీ పది నిమిషాలకు ఓ బస్సు నడుపుతోంది. మార్చి 6-8 వరకు లోసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో మోటో2, మోటో3 రేస్ జరుగుతున్న విషయం తెలసిందే. అయితే..ఇవాళ (మార్చి 6) మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రతీ పది నిమిషాలకు ఓ బస్సును నడపనున్నారు. ఇక రేపు, ఎల్లుండి (మార్చి 7, 8) మాత్రం ఉదయం 11.30 నుంచే బస్సు సర్వీసులు మొదలవుతాయి. రాత్రి 7.30 వరకు షటీల్ సర్వీసులు ఖతార్ గ్రాండ్ ఫ్రీ ఫ్యాన్స్ సర్వీస్ అందించనున్నాయి. ఖతార్ గ్రాండ్ ఫ్రీకి వేదికైన లోసైల్ క్లబ్ లో పిల్లలు ఎంజాయ్ చేసే కిడ్స్ కార్టింగ్, కిడ్స్ క్వాడ్ బైకింగ్, స్కేట్ పార్క్ తో పాటు వైరైటీ ఫుడ్ డిషెస్ ను కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!