కరోనా ఎఫెక్ట్ : ప్రార్ధన సమయం 10 నిమిషాలు మించొద్దు..యూఏఈ సర్క్యూలర్
- March 06, 2020
యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తో ఫ్రైడే ప్రార్ధనల సమయాన్ని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ కుదించింది. కేవలం పది నిమిషాల్లో ఖచ్చితంగా ప్రేయర్ ముగించాలని యూఏఈలోని అన్ని మసీదుల్లోని ఇమామ్ లకు సర్క్యూలర్ జారీ చేసింది. జనసమూహం ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ సర్క్యూలర్ ప్రార్ధన విధానంపై డైరెక్షన్స్ ఇచ్చారు. ఇమామ్‌లు పవిత్ర ఖురాన్ లోని రెండు శ్లోకాలను మాత్రమే చదవాలని, ప్రసంగ లేఖలో పేర్కొన్న ఖచ్చితమైన ప్రసంగం, దువాను చదవాలని క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన 10 నిమిషాలకు మించరాదని, ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు