అమెరికాలో భారతీయ స్టూడెంట్స్ కి కొత్త కష్టం
- March 06, 2020
అమెరికాలో భారతీయులకు కష్టమొచ్చింది. వచ్చే ఏప్రిల్ తో 68 వేల మంది ఎన్నారై స్టూడెంట్ల భవిష్యత్ రోడ్డున పడనుంది. ఓపీటి ముగియనుండటంతో భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉన్నత విద్యకోసం ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడ హెచ్ 1 బి వీసా కోసం ఎదురుచూస్తున్న వారు 68 వేల మంది ఉన్నారు. వీరిలో తెలుగు వారు అత్యధికంగా 24 వేల మంది ఉన్నారు.
వీరి అమెరికా నివాస గడువు ఈ ఏప్రిల్ తో ముగియనుంది. వీరిలో ఎవరికైతే హెచ్ 1 బి వీసా దొరుకుతుందో వారు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. మిగతా వారు అక్కడి నుంచి ఉద్యోగాలు వదిలి అర్ధంతరంగా తిరుగుపయనం కాక తప్పదు. వీరంతా ప్రస్తుతం ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం) కింద అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. హెచ్ 1బి వీసా రానివారికి తిరుగుపయనం తప్పదు.
ఒకవేళ అక్కడే ఉండాలి అనుకుంటే... వారికు మరో అవకాశం ఉంది. అక్కడ ఏదైనా మరోకోర్సులో జాయిన్ అయితే... మరో మూడేళ్లు నివాసం ఉండొచ్చు. కోర్సులో చేరాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నవారికి అది సాధ్యమవుతుంది. కానీ ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు.
అమెరికాలో ఉద్యోగం చేయాలంటే... హెచ్ 1 బి వీసా ఉండాలి. ఇది విదేశీయులకు అమెరికాలో ఉండటానికి జారీ చేసే అనుమతి పత్రం వంటిది. ఇది మొదటి సారి మూడేళ్లకు ఇస్తారు. తర్వాత దానిని మరోసారి పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఆరేళ్లు మాత్రమే ఈ వీసా మీద అమెరికాలో ఉండగలరు.
ఏదైనా స్కిల్ ఆధారంగా మాత్రమే దీనిని మంజూరు చేస్తారు. ఈ హెచ్-1బీ వీసా మూడు రకాలుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్దేశించిన సంఖ్యలో మాత్రమే వీసాలను జారీ చేస్తారు.
హెచ్ 1 బి వీసా పొందిన వారి రక్తసంబంధీకులు డిపెండెంట్ వీసా ( హెచ్ 4) తీసుకుని వారితో కలిసి ఉండొచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







