శ్రీవారి ఆర్జిత టికెట్లు జూన్ కోటా విడుదల
- March 06, 2020తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే పలు ఆర్జిత సేవలకు సంబంధించిన జూన్ నెల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. మొత్తం 60,666 టికెట్లు విడుదల చేయగా ఇందులో 50,700 టికెట్లు ఆన్ లైన్ జనరల్ కేటగిరీలో ఉంచారు. ఆన్ లైన్ డిప్ విధానంలో 9966 టికెట్లు విడుదల చేశారు. మొత్తం టికెట్లలో సుప్రభాతం 7,681, నిజపాదదర్శనం 1725, అష్టదళ పద్మారాధన 300, తోమాల 130, అర్చన 130 ఉన్నాయి. ఆన్ లైన్ కేటగిరీలో సహస్ర దీపాలంకార సేవ 17,400, కల్యాణం 13,300, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, ఊంజల్ సేవ 4,200, విశేష పూజలవి 1500 టికెట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..