అబుధాబి: 2 వారాల్లో ఫైన్స్ పై 50% డిస్కౌంట్ గడువు ఫినిష్..సద్వినియోగం చేసుకోవాలని సూచన
- March 06, 2020
అబుధాబి:ఫైన్స్ చెల్లింపుల్లో 50% డిస్కౌంట్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది. మరో రెండు వారాల్లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే డిస్కౌంట్ వర్తించనుంది. మార్చి 22తో గడువు ముగుస్తందని ఆలోగా మోటరిస్టులు ఫైన్ చెల్లించకుంటే పూర్తి ఎమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు. మోటరిస్టులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గతేడాది చివర్లో తొలిసారిగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22 కంటే ముందు విధించిన జరిమానాలను ఫిఫ్టి పర్సెంట్ డిస్కౌంట్ తో చెల్లించొచ్చని...అందుకు మార్చి 22 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు పెనాల్టీ పాయింట్స్ లో కూడా మినహాయింపు ఉంటుంది. అయితే..50% డిస్కౌంట్ కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఫైన్ విధించిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించిన వారికి 35% రిడక్షన్ ప్రకటించారు. అయితే..సీరియస్ వయోలేషన్స్ కేసులో మాత్రం డిస్కౌంట్, పాయింట్స్ మినహాయింపులు వర్తించవని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ వయోలేషన్స్ ఇష్యూస్ లో పెనాల్టీ పాయింట్స్ 24 దాటితే మోటరిస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
----సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







