కరోనా అలర్ట్ : యూఏఈలో 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్
- March 06, 2020
యూఏఈలో లేటెస్ట్ గా మరో వ్యక్తికి కోవిడ్-19 పాజీటీవ్ వచ్చింది. 17 ఏళ్ల ఎమిరాతి స్టూడెంట్ కు కరోనా సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ MOHAP అధికారులు ప్రకటించారు. ఈ లేటెస్ట్ కేసుతో యూఏఈలో కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయిన బాలుడ్ని వెంటనే ఐసోలేట్ వార్డుకు తరలించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉందని చెబుతున్నారు. 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్ అని తేలటంతో ఎమిరాతి స్టూడెంట్ చదువుతున్న స్కూల్ కు సెలవులు ప్రకటించారు. స్పెషలిస్ట్ టీమ్స్ తో స్కూల్ ప్రాంగణంలో అవసరమైన స్టెరిలైజేషన్ పనులు చేపట్టారు. అలాగే బాలుడితో డైరెక్ట్ కాంటాక్ట్ అయినవారికి కూడా కోవిడ్-19 టెస్టులు చేపట్టారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..