చంద్రబాబు దావోస్ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ కి లాభం ....
- January 22, 2016
దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగో రోజు బిజీబిజీగా గడిచింది. శుక్రవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యవసాయంలో కొత్త దృక్కోణం, కార్యాచరణపై చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం చేపట్టిన.. రైతు సాధికార సంఘం, రైతు రుణాల విముక్తి, ఇన్‌పుట్ సబ్సిడీ, కరవురహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు..ఫామ్‌పాండ్స్, నదుల అనుసంధానం గురించి వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు.. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం..వాణిజ్యపరంగా నిలదొక్కుకునేలా చూడటం వంటి అంశాలలో ఏపీతో భాగస్వామి కావాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు..రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







