కరోనా ఎఫెక్ట్‌: హోలీ వేడుకలు రద్దు

- March 06, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: హోలీ వేడుకలు రద్దు

బహ్రెయిన్:ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్‌లో హోలీ వేడుకల్ని రద్దు చేశారు. మనామాలో 200 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీనాథ్‌జీ కృష్ణ టెంపుల్‌, హోలీ అలాగే రంగోత్సవ్‌ సెలబ్రేషన్స్‌ని ఈ ఏడాది రద్దు చేస్తున్నఱ్లు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు డివోటీస్‌కి సమాచారం పంపించారు. ఎక్కువగా గేదరింగ్స్‌ వుండకూడదని ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు సూచించడం జరిగింది. తట్టయ్‌ హిందు కమ్యూనిటీ ఛైర్మన్‌ సుశీల్‌ ముల్జిమాల్‌ (టెంపుల్‌ నిర్వాహకులు) మాట్లాడుతూ, బహ్రెయిన్‌ ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతునిస్తున్నామనీ, కరోనా వైరస్‌ని అరికట్టే విషయంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామనీ, ఈ నేపథ్యంలోనే ప్రతి యేడాదీ నిర్వహించే హోలీ / రంగోత్సవ్‌ని రద్దు చేస్తున్నామి చెప్పారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com