ఓన్లీ ఫ్రూట్ డైట్..
- March 07, 2020
భారీగా పెరిగి పోతున్న బరువుని చూసి భయపడితే లాభం లేదు. ఏదో ఒకటి చేసి తగ్గాలని రాత్రికి రాత్రి ఆలోచన చేయడం సరికాదు. థైరాయిడ్ సమస్య కావచ్చు, మారిన జీవన సరళి కావచ్చు.. మీ బరువుకి మీరే బాధ్యులు. డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం సరికాదు. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఆహార నియంత్రణతో పాటు, శరీరానికి తగినంత వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. తినే వేళల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరుతిళ్లకు స్వస్తి చెప్పాలి. కూల్ డ్రింకులు, జంక్ ఫుడ్డుకు దూరంగా ఉండాలి. మితంగా భోజనం చేయాలి. పోషకాహార డైట్‌ని తీసుకుంటే మీ శరీరం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఓ వారం రోజుల పాటు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని కూడా ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించొచ్చని అంటున్నారు డైటీషియన్లు.
మరి అదెలాగో చూద్దాం ఓ సారి.. రోజుకు మూడు పూటలా పండ్లే తీసుకోవాలి. అదే మీ ఆహారం . ఉదయం లేవగానే ఓ లీటర్ గోరు వెచ్చని నీరు తీసుకోవాలి. ఒక్కసారే తాగలేకపోతే మద్యలో ఐదు, పది నిమిషాలు గ్యాప్ తీసుకుని తాగవచ్చు. ఆ తరువాత వ్యాయామం చేసి టిఫిన్ బదులు ఇష్టమైన ఫ్రూట్స్ తినవచ్చు. లేదంటే ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు. ఇక మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం బదులు కేవలం ఫ్రూట్స్‌ని మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్స్ తిన్న గంట తరువాత నీరు తాగాలి. రాత్రి పూట 7గంటలలోపే ఫ్రూట్స్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. ఇలా ఓ వారం రోజులు చేస్తే కచ్చితంగా కొవ్వును కరిగించుకోవచ్చంటున్నారు. ఎందుకైనా మంచిది.. మొదలు పెట్టే ముందు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది గమనించుకోండి. ఓసారి డాక్టర్‌ని సంప్రదించి స్టార్ట్ చేస్తే మంచిది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







