ఉమ్రా బ్యాన్ తర్వాత తొలి ఫ్రైడే ప్రేయర్స్
- March 07, 2020
మక్కా:మక్కా మరియు మదీనాలోనిలోని గ్రాండ్ మాస్క్ వద్ద ముస్లింలు శుక్రవారం ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మక్కా మరియు మదీనాలో మాస్క్ వద్ద కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఉమ్రా బ్యాన్ తర్వాత జరిగిన తొలి శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా అవాద్ అల్ జుహాని మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తిని నిరోధించే విధంగా షరియత్ చట్టానికి లోబడి అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని అన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా తాత్కాలికంగా కాబా ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. హిల్స్ ఆఫ్ సాఫా మరియు మర్వాలో కూడా నిషేధాజ్జలు అమలు చేశారు. మదీనాలోని ప్రొఫెట్ మాస్క్లోగల సేక్రెడ్ ఛాంబర్‌ని కూడా మూసివేయడం జరిగింది. కాగా, టూరిజం సెక్టార్ సహా అనేక విభాగాలు వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలిక నిషేధం విధించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!