షార్జా: ఖోర్ ఫక్కన్ మౌంన్టేన్ పై చిక్కుకుపోయిన 8 మంది ట్రెక్కర్స్..రక్షించిన రెస్క్యూ టీమ్స్
- March 08, 2020
పర్వాతారోహణకు వెళ్లిన ఎనిమిది మంది ట్రెక్కర్స్ కొండ అంచుకు వెళ్లగానే అక్కడే చిక్కుకుపోయారు. ఖోర్ ఫక్కన్ మౌంన్టేన్ ను అధిరోహించిన ఆ ఎనిమిది మందికి మళ్లీ
వెనక్కి తిరిగొచ్చే మార్గం కనిపించలేదు. దీంతో కొండపైనే సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. విషయం తెల్సుకున్న రెస్క్యూ సెంటర్ వారిని కాపాడేందుకు ఈస్ట్రన్ రీజినల్ పోలీస్, సివిల్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ ప్రొటెక్షన్ అధికారులతో రెస్క్యూ టీంను ఏర్పాటు చేసింది. ట్రెక్కర్స్ చిక్కుకుపోయిన లోకేషన్ ను ట్రేస్ చేసిన వెంటనే చాపర్ సాయంతో ముగ్గురిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. మిగిలిన ఐదుగురిని సివిల్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కోస్టల్ ప్రొటెక్షన్ సాయంతో రక్షించారు. దీంతో ఎనిమిది ట్రెక్కర్స్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం రెస్క్యూ సెంటర్ అధికారులు మాట్లాడుతూ.. ట్రెక్కర్స్ అంతా ఎక్స్ ట్రా కాషన్స్ పాటించాలని, ముఖ్యంగా రిమోట్ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త చర్యలు అవసరమని సూచించారు. అలాగే కమ్యూనికేషన్ డివైజెస్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..