మారుతీరావు ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్
- March 09, 2020
మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, తమ ప్రాథమిక నివేదికను పోలీసు అధికారులకు అందించారు. ఈ నివేదికలో మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలనూ వైద్యులు గుర్తించలేదని తెలుస్తోంది.
అయితే బ్రెయిన్ డెడ్ కారణంగానే ఆయన మరణించారని పేర్కొన్నారు. అందుకు విషం తీసుకోవడమే కారణమని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..