కరోనా ఎఫెక్ట్: 9 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన సౌదీ
- March 09, 2020
రియాద్: కొవిడ్-19(కరోనా)ను అదుపులోకి తెచ్చేందుకు సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీలో కరోనా వ్యాపించకుండా, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది దేశాల నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిలిపివేత ప్యాసెంజర్లపై కూడా ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధించిన దేశాల్లో 14 రోజుల ముందు నుంచి ఉన్న వారెవరు దేశంలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. దీంతో సౌదీ, తొమ్మిది దేశాల మధ్య ప్యాసెంజర్లకు అంతరాయం కలగనుంది. ఎయిర్‌లైన్స్‌తో పాటు బోటు ప్రయాణాలపై కూడా ఈ నిషేధమున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. షిప్పింగ్, వాణిజ్య, ఇతరుల తరలింపు వంటి వాటిని మాత్రం ఈ నిలిపివేత నుంచి మినాహాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిషేధించిన దేశాల జాబితాలో.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, లెబనాన్, సిరియా, సౌత్ కొరియా, ఈజిప్ట్, ఇటలీ మరియు ఇరాక్ దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ఇలా తాత్కాలికంగా రాకపోకలను నిషేధించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. కీలక సమయాల్లో మాత్రం ప్రభుత్వం కొందరి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







