ఏపీ హైకోర్టు కీలక తీర్పు
- March 10, 2020
అమరావతి:ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సీఎస్ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈసీ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సూచించింది. వైకాపా జెండా రంగు తరహాలో రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







