బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా
- March 11, 2020
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్(కొవిడ్-19) సామాన్యులతో పాటు వీఐపీలు, దేశాల మంత్రులనూ వదలట్లేదు. ఇప్పటికే ఇరాన్లో ఎంపీలకు, మంత్రులను సోకిన వైరస్ తాజాగా బ్రిటన్ ఆరోగ్యశాఖ ఉపమంత్రి నాడీన్ డోరిస్‌కు సంక్రమించింది. ఈ విషయం ఆమే స్వయంగా ప్రకటించారు. తనకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నాని వెల్లడించారు. గత శుక్రవారం కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన ఓ ఫైల్‌పై సంతకం చేస్తున్న సమయంలో ఆమె తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె పలువురు ఉన్నతాధికారులు, నాయకులను కలిసినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందర్నీ గుర్తించే పనిలో పడ్డారు. ఆమె కలిసిన వారిలో ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బ్రిటన్‌లో వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. మరో 373 మందికి ఈ మహమ్మారి సోకింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..