కరోనా ఎఫెక్ట్‌: అజ్మాన్ లో క్యాబీలు మాస్క్‌లు ధరించాల్సిందే

- March 11, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: అజ్మాన్ లో క్యాబీలు మాస్క్‌లు ధరించాల్సిందే

అజ్మాన్ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఎపిటిఎ), క్యాబ్‌ మరయు బస్‌ డ్రైవర్లు మాస్క్‌లు ధరించాలనీ, తమ వాహనాల్ని ప్రతిరోజూ స్టెరిలైజ్‌ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లు ప్రతి వారం మెడికల్‌ చెకప్స్‌కి హాజరు కావాల్సి వుంటుంది. ఎపిటిఎ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ ఒమర్‌ లూటా మాట్లాడుతూ, 400 ట్యాక్సీలు ఈ వారం స్టెరిలైజ్‌ చేయబడ్డాయని చెప్పారు. ఎక్స్‌టీరియర్స్‌, ఇంటీరియర్స్‌ని స్టెరిలైజ్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు. ట్యాక్సీ కంపెనీ ఓనర్లకు ఈ విసయమై సర్క్యులర్‌ జారీ చేసినట్లు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com