క్రికెట్ అభిమానులకు షాక్.. ఐపీఎల్ వద్దని కోర్టులో పిటిషన్..!
- March 11, 2020
చైనాలో మొదలైన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాను కూడా ఇప్పుడు కరోనా బెంబేలెత్తిస్తుంది. తాజాగా ఇండియా వ్యాప్తంగా 60 కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఇక మార్చి 29 నుండి ప్రారంభం కావలసిన ఐపీఎల్ 13వ సీజన్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఐపీఎల్ ను నిర్వహించడానికి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవద్దని కోరుతూ మద్రాస్ హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంచ్ గురువారం విచారం చేపట్టనుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెబ్సైటు లో కోవిడ్-19 మందును ఇంకా కనుగొన్నట్లు నమోదు కాలేదని పిటిషన్ లో అలెక్స్ తెలిపారు. ఇక మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఐపీఎల్ ను వాయిదా వేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







