గల్ఫ్ జెఏసి కన్వీనర్ గా గుగ్గిళ్ల రవిగౌడ్
- March 11, 2020
తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ (గల్ఫ్ జెఏసి) కన్వీనర్ గా ప్రముఖ ప్రవాసి కార్మిక నాయకుడు గుగ్గిళ్ల రవిగౌడ్ ఎన్నికయ్యారు. వివిధ దేశాల నుండి వచ్చిన తెలంగాణ ప్రవాసి సంఘాల ప్రతినిధులు, రాష్ట్రములోని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు మంగళవారం (10.03.2020) రాత్రి జగిత్యాలలో సమావేశమై గల్ఫ్ జెఏసి ని ఏర్పాటు చేసుకున్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రవాసీ విధానం (ఎన్నారై పాలసీ) ప్రవేశపెట్టే విధంగా పనిచేయడమే గల్ఫ్ జెఏసి ఉద్దేశమని రవిగౌడ్ అన్నారు. ఈ శాసన సభ, శాసన మండలి సమావేశాలలో ప్రవాసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ బిల్ ప్రవేశపెట్టి చట్టం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కోర్ కమిటీ
నెరువుట్ల బాబు స్వామి, గాజుల సంపత్, సముద్రాల శ్రీనివాస్, సుందరగిరి శంకర్ గౌడ్, గాoదరి సత్యనారాయణ, స్వదేశ్ పరికిపండ్ల, గోలి శ్రీనివాస్ లతో తాత్కాలిక కోర్ కమిటీని ఎన్నుకున్నారు. విదేశాలలోని, రాష్ట్రంలోని అన్ని సంఘాలను సంప్రదించి గల్ఫ్ జెఏసి ని విస్తరిస్తామని రవిగౌడ్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?