బహ్రెయిన్:కరోనా ట్రీట్మెంట్ డాక్టర్ల నిర్లక్ష్యంపై మెడికల్ సొసైటీ సీరియస్

- March 12, 2020 , by Maagulf
బహ్రెయిన్:కరోనా ట్రీట్మెంట్ డాక్టర్ల నిర్లక్ష్యంపై మెడికల్ సొసైటీ సీరియస్

బహ్రెయిన్:కోవిడ్-19 ట్రీట్మెంట్ లో గైడ్ లైన్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్ల పట్ల బహ్రెయిన్ మెడికల్ సొసైటీ సీరియస్ అయ్యింది. కొందరు డాక్టర్లు కరోనా వైరస్ టాకిల్ చేయటంలో ప్రొటోకాల్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైరస్ ఎదుర్కొవటంలో సరైన పద్దతులు అవలంభించకుండా ఇష్టారీతిన వ్యవహరించటం అంటే ప్రజల ప్రణాలతో చెలగాటం ఆడటమేనని సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొవాలంటే డాక్టర్లు మరింత చిత్తశుద్దితో ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, అది చాలా ప్రధానమైన అంశమని కూడా నొక్కి చెప్పింది.  ఇంతటి తీవ్రమైన సమయంలో కూడా కొందరు డాక్టర్లు గైడ్ లైన్స్ పాటించకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పబ్లిక్ సెఫ్టీని ఫణంగా పెట్టడం పట్లు సొసైటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాంటి వారి పట్ల చర్యలకు ఉపక్రమించింది. కరోనా వైరస్ పేషెంట్ కు ఐసోలేషన్ ట్రీట్మెంట్ అందించే డ్యూటీలో ఉన్న ఓ డెంటిస్ట్...తన డ్యూటీని వదిలేసి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న సొసైటీ అతన్ని సస్పెండ్ చేసింది. అతని క్లినిక్ ను క్లోజ్ చేయటంతో పాటు క్లినిక్ వెళ్లిన వాళ్లందరికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి బహ్రెయిన్ చేరుకునే ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాల్సిందేనని మరోసారి బహ్రెయిన్ మెడికల్ సొసైటీ గుర్తు చేసింది. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన చర్యలు తప్పవని బీఎంఎస్ హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com