కరోనా: ఇటలీలో వందలాది తెలుగు విద్యార్థుల కష్టాలు
- March 12, 2020
రోమ్: కరోనా కట్టడి కోసం ఆరోగ్య దిగ్బంధం అమలవుతున్న నేపథ్యంలో వందలాది మంది తెలుగు విద్యార్థులు ఇటలీలో చిక్కుకుపోయారు. ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారనే ధ్రువీకరణ లభిస్తేనే స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని.. అయితే ఆ ధ్రువీకరణ ఇచ్చేందుకు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'బొలొగ్న వర్సిటీలో 30 మందికిపైగా తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారికి కరోనా లక్షణాలు లేవు. అయినా ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఆస్పత్రులు మంజూరు చేయడం లేదు. దీంతో మేం ఇళ్లు దాటే పరిస్థితి లేకుండా పోయింది' అని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన గెల్ల బద్రీనాథ్ తెలిపారు. ఇక పడోవా వర్సిటీలో 50 మందికిపైగా భారత విద్యార్థులు చదువుతున్నారు. వారిలో అత్యధికులు విజయవాడ పరిసర ప్రాంతాల వారేనని తెలుస్తోంది. కొడొగ్నో నగరంలో మరో 100 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని అక్కడ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీచరణ్ తేజ తెలిపాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







