అబుధాబి:అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు ఈ-లెర్నింగ్ ఎక్స్ టెండ్ చేసే ప్లాన్స్ లేవు
- March 12, 2020
అబుధాబి:కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్ స్టూడెంట్స్ కి ఈ-లెర్నింగ్ సిస్టం అమలు చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ ను మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ కొట్టిపారేసింది. ఇప్పటివరకు అలాంటి ప్లాన్స్ ఏమి లేవని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న బేస్ లెస్ వార్తలను పేరెంట్స్ ఎవరూ పట్టించుకోవద్దని కూడా సూచించింది. కరోనా వైరస్ కారణంగా ఈ అకాడమిక్ ఇయర్ ను క్లోజ్ చేసి..స్టూడెంట్స్ కి ఈ-లెర్నింగ్ ద్వారా లెసెన్స్ కంటిన్యూ చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చిన విద్యా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే..తమకు విద్యార్ధుల ప్రయోజనాలే అధిక ప్రధాన్యమని వారికి సంబంధించిన అంశాలను అధికారిక వెబ్ సైట్లలోగానీ, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో గానీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. పేరెంట్స్ అధికారిక వెబ్ సైట్లలో అందించిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కూడా మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?