భారత్: 60కి చేరిన కరోనావైరస్ కేసులు
- March 12, 2020
దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 60 కి చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్లు ఉన్నారు. మిగతావారంతా భారతీయులేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చినవారే ఎక్కువగా వున్నారు. కరోనా అనుమానితులకు కనీసం రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాతే వైరస్ ను నిర్ధారిస్తున్నట్టు అధికారులు తెలిపారు…
ఇదిలావుంటే, భారత్లో కరోనా అనుమానితుడు మృతిచెందడం కలకలం రేపుతోంది. కర్నాటకతకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు…ఇతడు సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఇతడికి కరోనా లక్షణాలు వున్నాయని కలబుర్గి జిల్లా వైద్యాశాఖ అధికారి ప్రకటించారు. మృతుడి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. రిపోర్ట్ రావాల్సి వుందన్నారు. ఒకవేళ మృతుడికి కరోనా సోకిందని తేలితే.. భారత్ లో ఇదే తొలి కరోనా డెత్ కానుంది..
కరోనా నియంత్రణకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 15 వరకు యాత్రికుల వీసాలు సస్పెండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు, రాయబారులు తప్ప మిగిలిన వారికి వీసాలను వచ్చే నెల 15 వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఇటలీ, దక్షిణ కొరియా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా ఫ్రీ సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేసింది. తమ వెంట గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుంచి.. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే భారత్ లోకి అనుమతిస్తారు. అటు.. ఈశాన్య రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు..
అటు..ఐపీఎల్ నిర్వహణపైనా అనుమానాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వం కోరాయి. మద్రాస్ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ పిటీషన్ దాఖలైంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలనపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అటు.. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం… మార్చి 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు