జెడ్డాలో కరోనా: రూమర్స్‌ని కొట్టి పారేసిన పోలీస్
- March 12, 2020
మక్కా: మక్కా రీజియన్ పోలీస్ మేజర్ ముహమ్మద్ అల్ ఘామ్ది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తున్న ‘మక్కాలో కరోనా వైరస్’ రూమర్స్‌ని కొట్టి పారేశారు. ఇప్పటిదాకా జెడ్డాలో ఎలాంటి కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కాగా, చైనాకి చెందిన ఓ మహిళ జెడ్డాలో అస్వస్థతకు గురైందనీ, ఆమె కరోనాతో బాధపడుతోందనీ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఓ కమర్షియల్ షాప్‌లో చైనాకి చెందిన ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగిందనీ, ఈ ఘటనలో చైనాకి చెందిన పురుషుడికి గాయాలయ్యాయనీ, అతన్ని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది తప్ప, అది కరోనా కేసు కాదని తేల్చి చెప్పారు పోలీస్ అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







