రజనీకాంత్ మీడియా సమావేశం

- March 12, 2020 , by Maagulf
రజనీకాంత్ మీడియా సమావేశం

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయింది. త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. సీఎం పదవిపై తనకు వ్యామోహం లేదని...పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్పారు. గురువారం (మార్చి 12, 2020) మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదన్నారు.

వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థను మార్చకుండా మార్పు రాదన్నారు. వ్యవస్థను మార్చకుండా మార్పు రావాలనుకోవడం సరికాదన్నారు. చాలా మంది తనను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశలేదన్నారు. 1996కి ముందు రాజకీయాల గురించి ఆలోచించలేదని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తా అని రెండేళ్ల క్రితం మొదటిసారి చెప్పానని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్నారు. తన పార్టీలో 65 శాతం సీట్లు యువకులకే అన్నారు. పదవుల కోసం పనిచేసే వారు తనకు అసవరం లేదన్నారు. పాలిటిక్స్ ను పార్టీలు వ్యాపారంలా మార్చేశాయన్నారు. రాజకీయ నాయకులకు ప్రజలు కాదు...ఓట్లే ముఖ్యమని తెలిపారు. జయలలిత మృతితో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొందన్నారు.

అత్యధిక మంది పార్టీలో భాగస్వాములు అయ్యేలా చూసుకుంటాని అన్నారు. వనరుల దుర్వినియోగం పార్టీలో ఉండదన్నారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయన్నారు. నిజాయితీపరులకే సీఎం స్థానం దక్కాలని... తాను పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని తెలిపారు. పార్టీని గెలిపిస్తానని...వేరేవారిని సీఎంను చేస్తానని చెప్పారు. రిటైర్డ్‌ ఐఏస్‌, ఐపీఎస్‌లని పార్టీలలోకి ఆహ్వానిస్తానని అన్నారు. అన్నీ పార్టీలలో 50 ఏళ్ళకి పైబడిన వారే ఉన్నారని.. యువతకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com