దోహ:ఖతార్ లో ఒక్క రోజే 238 కరోనా కేసులు..అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్
- March 12, 2020
ఖతార్ లో కరోనా మహమ్మారి పడగ విప్పింది. ఒక్క రోజులోనే 238 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఖతార్ లో కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 262కు పెరిగింది. దీంతో ఖతార్ హెల్త్ మినిస్ట్రి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరింత క్లోజ్ మానిటర్ చేస్తోంది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందనే అభిప్రయానికి వచ్చింది. విదేశీ ప్రయాణికుల వల్లే వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ఇరాన్ తో పాటు కరోనా ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజులు క్యారంటైన్ లో ఉండాల్సిందేనని సూచించింది. ఇదిలాఉంటే ఖతార్ లో వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఖతార్ కు అన్ని కమర్షియల్ ఫ్లైట్స్ ను రద్దు చేసింది. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ కానున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు