దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్ ఆశీస్సులు
- March 12, 2020గతంలో పలు చిత్రాలు చేసిన దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) తాజాగా రూపొందించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. టైటిల్ పాత్రలలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా...ప్రముఖ నటి జమున ఓ కీలక పాత్ర పోషించారు. ఎమ్మెన్నార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ పట్ల తనకు గల అభిమానాన్నిదర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు చాటుకుంటూ హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ గారి మనవడు పోస్టర్స్ ను తిలకించిన కె.విశ్వనాద్ ఆ చిత్ర విశేషాలను శివనాగును ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అందరికీ సుపరిచితమైన పలువురు ప్రముఖ ఆర్టిస్టులు నటించిన....పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం విజయవంతం కావాలని కె. విశ్వనాద్ ఆకాంక్షించారు. ఇంకా షూటింగ్ చేసిన లొకేషన్స్ ను వాకబు చేసిన ఆయన అమరావతి పరిసర ప్రాంతాలలో తీశామని చెప్పగానే... ఒకప్పుడు తాను రూపొందించిన సప్తపది చిత్రాన్ని అదే సమయంలో గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్