హైదరాబాద్:కుంచెతో ప్రాణం,కాన్వాస్ పై మరో ప్రపంచం..ఆకట్టుకున్న నర్సింహగౌడ్ పెయింటింగ్స్
- March 13, 2020
హైదరాబాద్:అతను కుంచే పడితే ఓ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. పల్లె జీవన ప్రయాణం కళ్ల ముందు కదలాడుతుంది. బంజార ప్రజల సమైక్య జీవనం..గ్రామీణ వాతావరణం అన్ని ప్రాణం పోసుకొని కాన్వాస్ పై అమరినట్లు అబ్బురపరుస్తాయి. తొలకరి జల్లుతో వచ్చే మట్టివాసన ఇచ్చే ఉత్తేజం మన తెలంగాణ బిడ్డ కుంచెలోనూ కనిపిస్తుంది. అతని పేరు నరసింహగౌడ్. షాబాద్ ప్రాంతానికి చెందిన అతను చదువుకున్నది అంతంత మాత్రమే. కానీ, అతని చేతిలోని కుంచె నుంచి జాలువారే చిత్రాల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. అది వీక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
మనం ఎన్నో పేయింట్స్ చూసి ఉంటాం. ఎంతో మంది ఆర్టిస్టుల కలర్ కాంబినేషన్స్ కు అట్రాక్ట్ అయి ఉంటాం. కానీ, ఈ సారి హోలి మాత్రం రంగులు చల్లుకోవటం మానేసి..నరసింహ్మ గౌడ్ తన కాన్వాస్ పై ఆవిష్కరించిన కొత్త రంగుల లోకంలో మునిగిపోయారు జనం. హైదరాబాద్ లోని సాలర్ జంగ్ మ్యూజియం వేదికగా మహిళోత్సవ్-2020 పేరుతో ప్రదర్శించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ వీక్షలను విశేషంగా ఆకట్టుకుంది. పల్లె సంస్క్రతిలో ప్రముఖులను మిళితం చేస్తూ గీసిన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. యాదవుల వేషధారణలో ఒబామాను కళ్లకు కట్టినట్టు దించేశారు నర్సింహ్మ గౌడ్. తలపై గొంగడి, చేతిలో గొర్రెతో నిజంగానే ఒబామా ఫోటోకు ఫోజు ఇచ్చినట్లు బొమ్మను గీశారాయన. అలాగే తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలను హైలెట్ చేస్తూ హిషెల్లి ఒబామా బొనమెత్తినట్లు గీసిన చిత్రం అందర్ని ఆకట్టుకుంది.
ఇలా అతని కుంచె నుంచి జాలువారీన ప్రతీ లైన్ కాన్వాస్ కళాఖండంలో ఒదిగిపోయాయి. ప్రతీ రంగు కొత్త జీవం పోసుకున్నాయి. ఇక బంజార మహిళల థీమ్, పంటపొలాల పెయింటింగ్స్ అమాంతంగా పల్లెలకు తీసుకెళ్తున్నట్లు ఉంటాయి. అంతేకాదు..ఐశ్వర్యరాయ్, కీర్తి రెడ్డి లాంటి ప్రముఖుల చిత్రాలు అద్భుతంగా గీశారు. ఇక తిరుపతి గరుడ స్టాచ్యూలాంటి ప్రాంతాల థీమ్ తో నరసింహగౌడ్ వేసిన పెయింటింగ్స్ ఆయా ప్రాంతాలు కాన్వాస్ పై ఒదిగిపోయాయా అన్నట్లుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.ఈ ఎక్సభిషన్ ని సందర్శించిన మామిడి హరికృష్ణ(తెలంగాణ సంస్కృతి శాఖ డైరెక్టర్)కి నరసింహగౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?