దుబాయ్: ప్యాసెంజర్ ప్రాణాలు కాపాడిన సూపర్ కాప్
- March 13, 2020
ఓ పోలీస్ అధికారి తన సమయస్ఫూర్తి, స్పీడ్ రియాక్షన్ తో మూర్ఛతో కుప్పకూలిన ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ 2 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 వద్ద 44 ఏళ్ల ప్రయాణీకుడు మూర్ఛతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అదే సమయంలో విమానాశ్రయ భద్రతా విభాగంలో పనిచేస్తున్న సార్జెంట్ మొహమ్మద్ ఖలీద్ మొహమ్మద్ ప్రయాణికుడికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించాడు. ఇలాంటి కీలక సమయాల్లో ఎలా వ్యవహరించాలో, ప్రథమ చికిత్స అందించే విధానంపై చికిత్స తీసుకున్న సార్జంట్ మొహమ్మద్..వెంటనే పేషెంట్ కి శ్వాస అందించేలా అవసరమైన చర్య తీసుకున్నాడు. తిరిగి స్పృహ పొందేలా సీపీఆర్ అందించాడు. అంబులెన్స్, మెడికల్ టీం వచ్చే వరకు అతనికి అవసరమైన మెడికల్ సర్వీస్ అందించి ఆ అఫ్రికన్ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అఫ్రికన్ ప్రాణాలు కాపాడిన హీరో సార్జెంట్ ను దుబాయ్ పోలీసుల విమానాశ్రయ భద్రతా విభాగం డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అహ్మద్ బిన్ డైలాన్ అల్ మజ్రౌయి సత్కరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు