బహ్రెయిన్ వెళ్ళిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్
- January 23, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం బహ్రెయిన్ బయలుదేరి వెళ్లారు. ఇండియా-అరబ్ లీగ్ కోపరేషన్ ఫోరం తొలి సమావేశంలో పాల్గొనేందుకుగాను ఆమె అక్కడికిరెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ రెండు రోజులూ ఆమె బహ్రెయిన్ రాజధాని మనామాలో విడిది చేయనున్నారు. అరబ్ లీగ్ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు ఆ దేశాల మంత్రులతో సమావేశాల్లో ఆవిడ పాల్గొననున్నారు. అలాగే ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఖాలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో కూడా సమావేశమవుతారు. ఉగ్రవాదం, భద్రత, సౌదీ అరేబియా-ఇరాన్ గొడవలు తదితరాల గురించి ఆ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







