'కరోనా వైరస్' పై డా.షేక్ అల్తాఫ్ బాషాతో ముఖాముఖి...

- March 14, 2020 , by Maagulf
'కరోనా వైరస్' పై డా.షేక్ అల్తాఫ్ బాషాతో ముఖాముఖి...

ప్ర) కరోనా (COVID-19 )  వ్యాధి లక్షణాలు? 

జ) ప్రారంభ దశ - సాధారణ ఫ్లూ లక్షణాలు ,అంటే తుమ్ములు ,జలుబు ,జ్వరము,ముక్కు దిబ్బడ ,వొంటి నొప్పులు మొదలైనవి.ఒక వారం దాటాక - పొడిదగ్గు లేక తేలికపాటి కఫము తర్వాత ఆయాసము .ఈదశ న్యూమోనియా అనబడుతుంది ,ఇది ప్రమాదకరమైన పరిస్థితి .ఈ స్థితి లో ICU లో వైద్యం అవసరము అవుతుంది.

ప్ర) తీసుకోవలసిన జాగ్రత్తలు :

జ)  -జనసమ్మర్దం ఉన్న స్థలాలకు వెళ్ళకండి
      - పరిశుభ్రత పాటించాలి ,తరచూ చేతులు సబ్బుతో నీళ్లతో కడగాలి లేక ఆల్కహాల్ 
       కలిగి వున్న శానిటైజర్ తో శుభ్రం చేయాలి .
      - కరచాలనం కు బదులుగా చేతులు జోడించి నమస్కారం చేయటం అలవాటు 
         చేసుకోండి,
      - దగ్గు ,తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ పేపర్ కానీ చేతి రుమాలు కానీ లేక మన 
        మోచేతిని అడ్డు పెట్టుకోవాలి .   
      - దగ్గు,తుమ్ములు వున్న వారికీ కనీసం ఒక మీటర్ దూరం లో ఉండాలి ,
      - జలుబు ,దగ్గు తో బాధపడుతున్న వాళ్ళు పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండాలి వీలైతే 
           ఇంటినుండి పని చేయవచ్చు .

ప్ర) అనుమానం కలిగితే .....

జ) కరోనా వ్యాధి సోకినట్లు అనుమానం వున్న వాళ్ళు మాస్క్ ధరించి ,నేషనల్ అంబులెన్సు కు ఫోన్ చేసి దగ్గర లో వున్న ప్రభుత్వ వైద్య కేంద్రానికి వెళ్ళాలి .  

ప్ర) మనుగడ సాధించగలదా....

జ)  చైనాలో ఆవిర్భవించిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ,అన్ని ఖండాలలో కి ప్రవేశించి మనుగడ సాధించడం వల్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO )ఈ వ్యాధిని Pandemic గా ప్రకటించింది.
          
ప్ర) కరోనా వైరస్ కి మిగతా వైరస్ లకు తేడా ఏమిటి ?

జ) కరోనా కూడా అన్ని వైరస్ ల లాంటిదే .కరోనా వైరస్ జంతువుల నుండి మనుషులకు సోకి ,ప్రస్తుతం మనుషుల నుండి మనుషులకు సంక్రమిస్తోంది .ఈ జాతికి చెందిన వైరస్ ల ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇవి తమ జన్య లక్షణాలను మార్చుకుని కొత్త రూపంతో ఆవిర్భవించి గలవు. 

ప్ర) సాధారణ జలుబు ,జ్వరం లక్షణాలు  కరోనా వ్యాధి లక్షణాలు ఒక్క లాగానే ఉంటాయా? 

జ) ప్రారంభ దశ లో ఒక్క లాగానే ఉంటాయి .ఆ దశ దాటి ఊపిరి తిత్తులకు వ్యాధి వ్యా పించినప్పుడు కరోనా లక్షణాలు SARS వ్యాధిని పోలి ఉంటాయి.

ప్ర) వైద్య చికిత్స వివరాలు :

జ) కరోనా వైరస్ ను హతమార్చగల మందులు ప్రస్తుతం లేవు.పెద్ద ఎత్తున ప్రయోగాలు ,అన్వేషణ చైనా ,అమెరికా దేశాలలో జరుగుతున్నాయి .వీటి ఫలితాలపై భవిష్యతు లో చికిత్స ఆధారపడి ఉంటుంది .ప్రస్తుతం వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం ఇవ్వగలం .
వ్యాధి శ్వాస  కోశాలకు  వ్యాపించి ,  ఆక్సిజన్ మట్టం తగ్గి ,ఆయాసం కలిగే పరిస్థితి ఏర్పడి నప్పుడు ఐసీయూ లో వెంటిలేటరుతో కృత్రిమంగా శ్వాస ఇవ్వాలసి ఉంటుంది .

ప్ర) కరోనా వ్యాధి నివారణకు "వాక్సిన్" వుందా? 

జ) ఇప్పటికి అయితే లేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం మీద ప్రయత్నాలు కొనసాగుతున్నాయి .ఇవి సాకారమయి వాక్సిన్ అందుబాటులో రావటానికి కొంత సమయం పట్టవచ్చు.

ప్ర) కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి లో మందులున్నాయా?

జ) హోమియో,ఆయుర్వేద లాంటి ప్రత్యామ్నాయ వైద్యముతో కరోనా ను అరికట్టవచ్చు అనటానికి ఇంతవరకు ఆధారాలు లేవు.

ప్ర) ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెంచటం ద్వారా కరోనా బారి నుండి కాపాడుకోగలమా?

జ) కరోనా వ్యాధి మృతులలో ఎక్కువ మంది వృద్ధులు అంటే 70 ఏళ్ల పై బడినవారు ,మధుమేహం,ఊపిరితిత్తుల వ్యాధులు ,హృద్రోగం ,కాన్సర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నవారు.ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెంచటం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు కానీ నివారించ లేము.

--డా.షేక్ అల్తాఫ్ బాషా(తుంబె హాస్పిటల్, అజ్మన్,యూ.ఏ.ఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com