దోహాలో తాజాగా 17 కరోనా కేసులు
- March 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా 17 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 337కి పెరిగింది. క్వారంటీన్లో వున్న వలసదారుల్లో ఎవరికీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది. కొత్త కేసుల్ని కంప్లీట్ ఐసోలేషన్‌కి తరలించామనీ, వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నారని, ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో వారంతా వున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, ఖతార్‌లో మొత్తం 5309 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అవసరమైన పరీక్షల నిమిత్తం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా అనుమానిత లక్షణాలు కలిగి వుంటే, స్వచ్చందంగా సమీపంలోని ఆసుపత్రుల్ని సందర్శించాలని సూచిస్తోంది మినిస్ట్రీ.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు