బహ్రెయిన్:లేబర్ క్యాంప్ లోని వర్కర్స్ కు కరోనా నెగటీవ్..
- March 14, 2020
బహ్రెయిన్:మనామలోని ఓ కంపెనీలోని లేబర్ క్యాంప్ లో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కార్మికులు ఎవరికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో మెడికల్ టీం, ఇతర అఫిషియల్ టీమ్స్ ఊపిరిపీల్చుకున్నాయి. కంపెనీ లేబర్స్ అందరికీ ఒకే చోట ఆకామిడేషన్ ఇవటంతో కరోనా వైరస్ సోకిన వ్యక్తితో వాళ్లంతా కాంటాక్ట్ లో ఉన్నారు. తోటి వ్యక్తికి వైరస్ సోకిందని తెలియటంతో మిగిలిన వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యింది. కంపెనీ లేబర్స్ ని బయటికి రానివ్వకుండా అందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు చేపట్టారు. అయితే..రిపోర్ట్స్ నెగటీవ్ రావటంతో అటు కంపెనీ యాజమాన్యం, కార్మికులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. మెడికల్ రిపోర్ట్స్ నెగటీవ్ వచ్చినా..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లేబర్స్ అందరు 14 రోజుల పాటు క్వారంటైన్ పాటించాల్సిందేనని ఆదేశించారు. కార్మికులను హెల్త్ కండీషన్ ను చెక్ చేసేందుకు స్పెషలైజ్డ్ మెడికల్ టీంను ఏర్పాటు చేశారు. దీంతో ఈ 14 రోజులు కార్మికులు అందరూ కంపెనీ తమకు కేటాయించిన అకామిడేషన్ గదుల నుంచి బయటికి రావాటానికి వీల్లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కంపెనీ యాజమాన్యం కూడా పూర్తి మద్దతుగా నిలబడింది. అంతేకాదు డ్యూటీలోకి రాకున్నా సాలరీల చెల్లింపులు యధావిధిగా కొనసాగిస్తామని ప్రకటించింది. క్వారంటైన్ సమయంలో కంపెనీ అకామిడేషన్ గదులను వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. కార్మికులు శ్రేయస్సు, ప్రభుత్వానికి మద్దతుగా కంపెనీ యాజమాన్యం చూపిన చొరవకు ప్రభుత్వం కూడా అభినందించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు