ఫుజైరా: డ్రగ్గీకి ఏడేళ్ల జైలు శిక్ష..Dh20,000 జరిమానా

- March 15, 2020 , by Maagulf
ఫుజైరా: డ్రగ్గీకి ఏడేళ్ల జైలు శిక్ష..Dh20,000 జరిమానా

ఫుజైరా:డ్రగ్స్ కలిగిఉండటం, డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలు రుజువు కావటంతో ఓ అరబ్ యువకుడికి ఫుజైరా క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే Dh20,000 ఫైన్ విధించింది. నిందితుడు డ్రగ్స్ అలవాటు మానేశాడో లేదో నిర్ధారించుకునేందుకు అవసరమైన ల్యాబ్ టెస్టుకు సహకరించలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ తర్వాత తీర్పును వెల్లడించిన ఫుజిరై క్రిమినల్ కోర్టు..ఇన్ టైంలో ల్యాబ్ టెస్టుకు అటెండ్ కాకపోతే ఏడాది పాటు జైలు శిక్ష పొడగించాల్సి వస్తుందని నిందితుడ్ని హెచ్చరించింది. ఒకవేళ ల్యాబ్ టెస్టుకు యూరినరీ శాంపిల్స్ ను ఇవ్వటానికి అసలుకే నిరాకరిస్తే జైలు శిక్ష రెట్టింపు అవుతుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. యూరినరీ టెస్ట్ కు నిరాకరించటం అంటే నిషేధిత నార్కొటిక్ డ్రగ్స్ తీసుకున్నట్లేనని కూడా కోర్టు స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com