ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లకు ప్రతిష్టాత్మక చమేలి దేవి జైన్ అవార్డులు
- March 15, 2020
'ది వైర్' సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖానుమ్ షెర్వానీ, బెంగళూరుకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రోహిణి మోహన్ సంయుక్తంగా 2019కి గాను అత్యుత్తమ మహిళా జర్నలిస్ట్‌లుగా చమేలి దేవి జైన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా గత 38ఏళ్లుగా అత్యుత్తమ మహిళా జర్నలిస్ట్‌లకు ఇస్తున్నారు.
కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణాత్మక పరిస్థితుల్లోనూ రిపోర్టింగ్ చేసినందుకు గాను షెర్వానిని, అసోంలో ఎన్నార్సీపై పరిశోధనాత్మక జర్నలిజానికిగాను రోహిణి మోహన్‌ను ఎంపిక చేశారు జ్యూరీ సభ్యులు. ఈ అవార్డును తొలిసారి 1982లో ఇవ్వగా.. అప్పటి నుంచి తన పని ద్వారా వైవిధ్యం చూపిన ఒక మహిళా జర్నలిస్ట్‌కు ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు. అవార్డు గ్రహీతలు ఇంగ్లీష్, హిందీ మరియు స్థానిక మాధ్యమాల ప్రతినిధులు.
ఈ అవార్డు పొందిన 54 మందిలో నీర్జా చౌదరి, తవ్లీన్ సింగ్, ప్రియాంక దుబే, బర్ఖా దత్, సుప్రియ శర్మ, పమేలా ఫిలిపోస్‌లు ఉన్నారు. 'శ్రేష్ఠత, విశ్లేషణాత్మక నైపుణ్యం, సామాజిక ఆందోళన, శైలి, ఆవిష్కరణ, ధైర్యం, కరుణ.' వంటివాటిని పరిగనలోకి తీసుకుని ఈ అవార్డులను అందజేస్తారు. షెర్వానీ ది వైర్‌లో రెండు వీడియో షోలను నిర్వహిస్తుంది. 'అర్ఫా కా ఇండియా' మరియు 'హమ్ భీ భారత్'.
మీడియా ఫౌండేషన్ 1980 లో అత్యుత్తమ మహిళా జర్నలిస్ట్ కోసం చమేలి దేవి జైన్ అవార్డును స్థాపించింది. మహిళా జర్నలిస్ట్‌లకు మాత్రమే చమేలి దేవి జైన్ అవార్టులు ఇస్తారు. జైలుకు వెళ్ళిన ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు చమేలి దేవి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు