కరోనా వైరస్‌పై వదంతులు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష:కమిషనర్ అంజనీ కుమార్
- March 15, 2020
హైదరాబాద్:కరోనా వైరస్‌పై వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేసినా, వదంతులు వ్యాపింపజేసినా చర్యలు తప్పవన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 ప్రకారం అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైరస్‌పై దుష్ప్రచారం చేస్తూ పట్టుబడితే ఏడాది వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. వదంతులు ప్రచారం చేయడమంటే సమాజానికి చెడు చేయడమేనని, వీటి వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని అంజనీకుమార్ అన్నారు. కాబట్టి కరోనా వైరస్ వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు